నాగార్జున కెరీర్ లో 1989 గోల్డెన్ ఇయర్…ఎన్ని హిట్స్…?
Tollywood Hero Nagarjuna 1989 Movies : అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా టాలివుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున విక్రమ్ మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి విభిన్న సినిమాలతో ఎన్నో హిట్స్ అందుకుని ఇప్పటికీ కుర్ర హీరోలతో సమానంగా విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.
అయితే ఇతడి కెరీర్ లో 1989 ఓ గోల్డెన్ ఇయర్ గా చెబుతారు. మొత్తం ఆ ఏడాది 5సినిమాలు చేస్తే, అందులో రెండు ట్రెండ్ సెట్టర్ అయ్యాయి. ఓపక్క క్లాస్, మరోపక్క మాస్ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చాయి. విజయ్ సినిమాతో ఆ ఏడాది సందడి మొదలైంది. జనవరి 19న వచ్చిన ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్ గా చేయగా, బి గోపాల్ డైరెక్షన్ చేసాడు. ఈ మూవీ ఏవరేజ్ గా నిల్చింది.
ఇక ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో విక్కీ దాదా ఆ ఏడాది మార్చి 9న రిలీజై ,తొలిహిట్ అందుకుంది. నాగ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జూహ్లీ చావ్లా, టాలీవుడ్ అందాలనాటి రాధ నటించారు. రాజ్ కోటి సంగీతం అందించగా, నాగ్ డ్రెస్ లు అదిరిపోతాయి. తెలుగులో తొలిసారిగా మణిరత్నం డైరెక్ట్ చేసిన గీతాంజలి మూవీలో నాగార్జున సరికొత్త నటనకు కనబరిచి క్లాస్ ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
మే 10న విడుదలైన ఈ మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్ అయింది. 7సెంటర్స్ లో 100డేస్ ఆడింది. ఇళయరాజా ట్యూన్స్ అద్భుతం. 6నంది అవార్డులు, బెస్ట్ డైరెక్టర్ గా మణిరత్నం ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకున్నారు. ఇక మరో ట్రెండ్ సెట్టర్ మూవీ శివ. దీనికి కూడా ఇళయరాజా మ్యూజిక్ అందించి మెలోడీ సాంగ్స్ ఇచ్చారు.
గీతాంజలి తర్వాత 5నెలల విరామం తర్వాత రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి నాగ్ ని దగ్గర చేసింది.
ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. రామ్ గోపాల్ వర్మకు, డైలాగ్ రైటర్ తనికెళ్ళ భరణి లకు నంది అవార్డులు వచ్చాయి. ఇప్పటికీ ఈ మూవీ పేరుచెప్పకుండా ఎవరూ ఉండలేరు. నాగార్జునకున్న పాపులార్టీ ఎలాంటిదో అర్ధం అవుతుంది. ఇక చివరిగా అగ్ని మూవీ నిరాశ పరిచింది. మొత్తం మీద నాగ్ కెరీర్ లో మాస్, క్లాస్ ఆడియన్స్ లో రెండు ట్రెండ్ సెట్టర్ మూవీస్ అందుకున్న ఘనత తెలుస్తుంది.