Hair Fall:ఇలా చేస్తే జుట్టు ఎంత రాలిన 15 రోజుల్లో రెట్టింపు జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరగటం ఖాయం
Hair Fall Home Remedies In telugu : మారిన జీవనశైలి పరిస్థితులు, వాతావరణంలో కాలుష్యం. ఒత్తిడి, కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూలను వాడటం వలన జుట్టుకి సంబందించిన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. మన పూర్వీకులు వంటింటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలను వాడటం వలన జుట్టు సమస్యలు అసలు ఉండేవి కాదు.
కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు చూస్తున్నారు. జుట్టు రాలే సమస్య తగ్గించడానికి అలాగే తెల్ల జుట్టు నల్లగా మారటానికి జుట్టు రాలిపోయి బట్టతల గా మారకుండా ఉండటానికి మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా పర్ఫెక్టుగా పని చేస్తుంది. చాలామంది జుట్టు రాలడం ప్రారంభం కాగానే మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను కొనేస్తు వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
వాటి కారణంగా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది అది ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఫలితం శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే జుట్టురాలడం తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతూ జుట్టు మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ చిట్కా కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాము.
ఒక స్పూన్ బియ్యం,ఒక స్పూన్ మెంతులు రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులు,బియ్యంలను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో ఒక స్పూన్ అల్లం రసం వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.
మెంతులు, బియ్యం, అల్లంలో ఉన్న పోషకాలు చుండ్రు, జుట్టు రాలే సమస్య వంటి జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి సహాయ పడుతుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా సమస్యల నుండి బయట పడవచ్చు. ఈ చిట్కాను ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.