Healthhealth tips in teluguKitchen

Raisins and Curd:పెరుగులో నల్ల ఎండు ద్రాక్ష నానబెట్టి తింటే ఏమి అవుతుందో తెలుసా ?

Raisins and Curd Benefits In Telugu : ఈ సీజన్ లో తీసుకోవలసిన ఆహారాలలో పెరుగు ఒకటి. మనలో చాలా మందికి పెరుగు లేనిదే భోజనం పూర్తి కాదు. పెరుగులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఎన్నో పోషక విలువలు ఉన్న ఎండు ద్రాక్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు పెరుగులో ఎండు ద్రాక్ష నానబెట్టి తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.
curd benefits in telugu
వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అందులో అధికంగా ఉండే కాల్షియం ఎముక‌ల‌ను, కండ‌రాల‌ను దృఢ‌ప‌రిచి.కీళ్ల నొప్పుల‌ను దూరం చేస్తుంది.శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడటమే కాకుండా రక్తహీనత సమస్య కూడా తొలగిపోతుంది ప్రస్తుతం చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు.
black raisins
అటువంటివారు పెరుగులో నానబెట్టిన ఎండు ద్రాక్ష తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. సీజనల్ గా వచ్చే వ్యాధులు తగ్గుతాయి.ఈ రెండు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌ల‌కు కూడా దూరంగా ఉండొచ్చు. పెరుగు, ఎండు ద్రాక్ష రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి.
gas troble home remedies
ప్రేగుల్లో చెడు బ్యాక్టీరియాను తొలగించి మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జీర్ణ ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది. అలాగే కడుపులో మంటను తగ్గిస్తుంది. దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి, రక్తపోటును తగ్గించడానికి మరియు బరువును తగ్గించటానికి సహాయపడుతుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరంలో రోగనిరోదక శక్తి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి పెరుగులో ఎండుద్రాక్ష నానబెట్టి తినండి. రక్త ప్రవాహం బాగా సాగేలా చేసి రక్త పోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఒక కప్పు పెరుగులో 5 లేదా 6 ఎండు ద్రాక్షను వేసి ఒక గంట నానబెట్టి తినాలి. కాబట్టి పెరుగులో నానబెట్టిన ఎండు ద్రాక్షను తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.