Healthhealth tips in telugu

నిమ్మ తొక్కతో ఇలా చేస్తే… అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు కరగడం ఖాయం

Lemon Peel Weight Loss Tips in telugu : మారిన జీవనశైలి, వ్యాయామం చేయకపోవటం, ఎక్కువ సేపు కూర్చొని ఉండటం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వంటి అనేక రకాల కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలలో ముఖ్యమైనది అధిక బరువు సమస్య. ఈ సమస్య వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది.
Weight Loss tips in telugu
ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో ప్రతి ఒక్కరికి పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోతోంది. ఇలా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవటం వలన శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోయి అధిక బరువు సమస్య వేధిస్తోంది. ఈ సమస్య ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరూ కంగారు పడిపోయి భోజనం మానేస్తుంటారు.
lemon benefits
అయినా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గదు. అలాంటివారికి నిమ్మతొక్కలు చాలా బాగా సహాయం చేస్తాయి. మనం సాధారణంగా నిమ్మకాయలు తెచ్చుకుని నిమ్మరసం పిండుకుని నిమ్మ తొక్కలను పాడేస్తూ ఉంటాం. కానీ నిమ్మ తొక్కలలో ఉన్న ప్రయోజనాలు మనలో చాలామందికి తెలీదు. పొట్ట చుట్టూ కొవ్వు ఉన్న వారు ఇలా చేస్తే సరి.
Lemon Peel
మూడు నిమ్మ తొక్కలను తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే కొంచెం నిమ్మరసం కొంచెం తేనె కలుపుకుని తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. ప్రతిరోజు ఉదయం ఒకసారి మధ్యాహ్నం భోజనం చేయటానికి గంట ముందు తాగితే పొట్ట చుట్టూ కొవ్వు క్రమంగా తగ్గుతుంది.

ఒక నెల రోజులు చేసేసరికి ఆ తేడా మీరే గమనిస్తారు.నిమ్మ తొక్క‌ల్లో ఉండే పొటాషియం మ‌రియు ఇత‌ర పోష‌కాలు గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ర‌క్షిస్తుంది.అలాగే, మ‌ధుమేహం వ‌చ్చే రిస్క్‌ను త‌గ్గిస్తుంది మ‌రియు శ‌రీరంలో పేరుకుపోయి ఉన్న మ‌లినాలు కూడా బ‌య‌ట‌కు పంపుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.