Face Glow Tips;ఈ పొడితో ఇలా చేస్తే 7 రోజుల్లో ముఖం కాంతివంతంగా మిలమిలా మెరుస్తుంది
Face Glow Tips in telugu : మారిన జీవనశైలి మరియు వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో ముఖం మిద జిడ్డు పేరుకుపోయి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే మొటిమలు, నల్లని మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు రాగానే మనలో చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. అలా కంగారు పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.
ప్రతి ఒక్కరు ముఖం తెల్లగా మచ్చలు లేకుండా కాంతివంతంగా రావాలని కోరుకుంటారు దీనికోసం మార్కెట్లో దొరికే రకరకాల వాడుతూ ఉంటారు. అయినా ఫలితం తాత్కాలికంగా ఉంటుంది కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే ముఖం ముడతలు లేకుండా నల్లని మచ్చలు లేకుండా మెరిసేలా చేసుకోవచ్చు.
దీనికోసం కలోంజి విత్తనాలు చాలా బాగా సహాయపడుతాయి. కలోంజి విత్తనాలను మెత్తని పౌడర్ గా తయారు చేసుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ కలోంజి పౌడర్ లో ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి రాయాలి. 15 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే వృద్ధాప్య సంకేతాలను తగ్గించడమే కాకుండా ముఖం మీద మచ్చలు,మొటిమలు ఏమి లేకుండా ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u