Hair Growth Tips:వారంలో 2 సార్లు ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటం ఖాయం
Hair Loss Home Remedies in Telugu : మారిన జీవనశైలి మరియు వాతావరణంలో కాలుష్యం, ఒత్తిడి, కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూలను వాడటం వలన జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి చాలా తక్కువ ఖర్చులో ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
జుట్టు చిక్కులు లేకుండా మృదువుగా ఉండాలన్నా, జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలన్నా.. ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యకు ఖరీదైన ప్రొడక్ట్స్ మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
ఒక బౌల్లో ఒక స్పూన్ వెన్న తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ అలోవెరా జెల్, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. ఒక గంట అయ్యాక తేలికపాటి షాంపూ తో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే జుట్టు మృదువుగా ఆరోగ్యంగా పెరుగుతుంది.
జుట్టు పట్టులా మృదువుగా మారి మెరవటానికి కలబంద సహాయపడుతుంది. కలబందలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఇ జుట్టు పెరుగుదలలో ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు కుదుళ్లకు కావల్సిన పోషకాలను అందించడంతో పాటు జుట్టు ఒత్తుగా , పొడవుగా పెరిగేలా చేయడంలో కూడా కలబంద మనకు సహాయపడుతుంది.
కొబ్బరి నూనె జుట్టు కుదుళ్లలో ఫంగస్ పెరుగుదలను అడ్డుకుంటుంది. దీనివల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. కొబ్బరి నూనె జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. అంతే కాకుండా కండిషన్ చేస్తుంది. పోషణ, తేమతో కూడిన జుట్టు చిట్లిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి పొడి, పెళుసు జుట్టు ఉన్నవారు కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u