15 రోజులు తాగితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి తగ్గి ఎముకలు దృడంగా మారతాయి
Joint Pains Home Remedies In telugu : ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు రావటానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఎముకల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిందే.
ఎముకలు పెళుసుగా లేకుండా దృఢంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన డ్రింక్ ప్రతిరోజు డైట్లో చేర్చుకోవాలి.ఒక గిన్నెలో గింజ తీసిన ఒక ఎండు ఖర్జూరం, ఒక అంజీర్ వేసి నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. మరొక గిన్నెలో ఒక స్పూన్ నువ్వులు వేసి నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఒక ఆపిల్ తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
మిక్సీ జార్ లో ఆపిల్ ముక్కలు, నానబెట్టిన ఎండు ఖర్జూరం, అంజీర్, నువ్వులు, ఒక గ్లాసు బాదంపాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన డ్రింక్ లో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఎముకలకు సంబందించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా 30 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ వారంలో మూడుసార్లు ఈ డ్రింక్ తీసుకుంటే మంచిది.
ఒకప్పుడు 60 ఏళ్లకు వచ్చే కీళ్ల నొప్పులు ఇప్పుడు చాలా చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. కాబట్టి మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కీళ్ళనొప్పులు వచ్చాయంటే విపరీతమైన బాధ ఉంటుంది. అలాగే నాలుగు అడుగులు వేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. కీళ్ళనొప్పులు రావటానికి అధిక బరువు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.
ఈ డ్రింక్ తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు. అలాగే ఈ డ్రింక్ ఉదయం సమయంలో తాగటం వలన అలసట, నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. ఈ సీజన్ లో శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.