1 Spoon గింజలను ఉడికించి తీసుకుంటే….ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి…
kabuli chana Health Benefits in Telugu :మనలో చాలా మంది నల్ల శనగలను తింటూ ఉంటారు. అలా కాకుండా వారంలో కనీసం మూడు సార్లు kabuli chana తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కాబూలీ శనగలలో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో రెండు సార్లు వీటిని తింటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కాబూలీ శనగల్లో ప్రోటీన్ చాలా సమృద్దిగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
అలాగే విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం మరియు మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబూలీ శనగల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు తక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది.
అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నివారిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కాబూలీ శనగలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబూలీ శనగల్లో ప్రోటీన్,ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన బరువు తగ్గే ప్రణాళిక ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది.
కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి లేకుండా చేస్తుంది. దాంతో ఎక్కువ ఆహారం తీసుకోకపోవటం వలన బరువు తగ్గుతారు. కాబూలీ శనగల్లో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. దీనికి తోడు విటమిన్ సి, ఫైబర్ మరియు విటమిన్ బి6 కూడా గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం మరియు రక్తనాళాలలో పేరుకుపోయిన కొవ్వు మొత్తాన్ని తగ్గించడమే కాకుండా, ధమనులలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. కాబూలీ శనగలను నానబెట్టి ఉడికించి తింటే మంచిది. కాబూలీ శనగలు విరివిగానే లభ్యం అవుతాయి. కాబట్టి వారంలో రెండు సార్లు తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.