Pawan Kalyan అత్తారింటికి దారేది సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో…?
Attarintiki daredi movie Movie : పవన్ కళ్యాణ్ హీరోగా samantha హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో హంస నందిని ఇట్స్ టైం టూ పార్టీ నౌ.. అనే ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేసి అలరించింది.
ముందుగా ఈ ఆఫర్ అనసూయ వద్దకు వెళ్ళగా… ఆమె రెజెక్ట్ చేయటంతో హంస నందిని వద్దకు వెళ్ళితే… ఆమె ఓకే చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదటగా ఇలియానాను అనుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో సమంతను తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో అత్తారింటికి దారేది ఒకటి.
ఈ సినిమాలో నదియా పవన్ కళ్యాణ్ మధ్య ఉండే ఓ సీన్ కు పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. సినిమాకి అన్నీ కలిసి రావడంతో అవార్డుల పంట పండింది. . 61వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సినిమాకు 4 అవార్డులు వచ్చాయి. ఈ చిత్రం 187 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.