Healthhealth tips in telugu

రాత్రి సమయంలో అరటిపండు తింటే… ముఖ్యంగా ఈ సీజన్ లో…

Banana Health Benefits in telugu : అరటిపండు సంవత్సరం పొడవునా అందరికి అందుబాటు ధరలో ఉంటుంది. అలాగే ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అరటిపండ్లలో మన శరీరానికి కావాల్సిన,ఎంతోగానో ఉపయోగపడే చాలా రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయనే విషయం మనకు తెలిసిందే.
gas troble home remedies
ఈ పండులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థలోని సమస్యలను మటుమాయం చేస్తుంది. వాటిలో ముఖ్యంగ్గా చెప్పాలంటే అందులో పొటాషియం, విటమిన్ బి6, సి, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు పోషణనిస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు మనకు అరటి పండ్లను తినడం వల్ల కలుగుతాయి.
banana benefits in telugu
అయితే చలికాలంలో మాత్రం రాత్రి పూట అరటిపండ్లను తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే..? ఆయుర్వేద ప్రకారం.. చలికాలంలో రాత్రి పూట అరటి పండ్లను తినడం వల్ల మన శరీరంలో జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యలు ఇది వరకే ఉన్నవారికైతే మరింత ఇబ్బంది కలుగుతుంది.

అరటిపండ్లు జీర్ణం కావడానికి కూడా సమయం పడుతుంది. ఇది మలబద్ధకం సమస్యను పెంచుతుంది. ఈ కారణంగా అరటిపండును రాత్రి సమయంలో కంటే.. పగటిపూట తినడమే ఉత్తమం అని చెప్పవచ్చు. అందుకని అరటి పండ్లను చలికాలంలో రాత్రి పూట తప్ప మిగిలిన ఏ సమయంలోనైనా తినవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

దంతాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అరటి పళ్ళు తినకూడదు. అలాగే మైగ్రేన్‌తో బాధపడుతున్న వారు కూడా అరటిపండును తినకుండా ఉంటేనే మంచిది. అంతే కాకుండా షుగర్ వ్యాధి ఉన్నవారు అరటిపండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి ఈ సీజన్ లో అరటిపండు తినేటప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.