వారంలో 2 సార్లు తింటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అయ్యి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండదు
Bachali kura benefits:చలికాలంలో ఆకుకూరలు చాలా విరివిగా లభ్యం అవుతాయి. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, సరైన వ్యాయామం చేయకపోవటం వంటి అనేక కారణాలతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి పోతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో కూడా చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉంటుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవటానికి కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.ముఖ్యంగా రక్తనాళాల్లో బ్లాకేజ్ ఏర్పడి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. బచ్చలి కూర చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి చాలా బాగా పనిచేస్తుంది. బచ్చలి కూర చెడు కొలెస్ట్రాల్ ని కరిగించటంలో చాలా బాగా సహాయపడుతుంది.
బచ్చలికూరలో ఉండే ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ధమని గోడలకు అడ్డుపడే కొలెస్ట్రాల్‌కు వ్యతిరేకంగా పనిచేసి గుండెకు సమస్యలు లేకుండా చేస్తాయి. వారంలో మూడు సార్లు బచ్చలికూరను ఆహారంలో బాగంగా చేసుకుంటే మంచిది. ఇటువంటి ఆహారాలను తీసుకుంటూ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి.
చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులలో కొవ్వు పెరుకుపోతుంది. అందుకే ఈ కొలెస్ట్రాల్ లెవల్స్ ని కంట్రోల్ ఉంచడానికి ఆహారంలో ఫైబర్ శాతం పెంచడం, సంతృప్త కొవ్వులను తగ్గించడం, శాకాహారాన్ని పెంచడం, రిఫైన్డ్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా ఉండడం వంటి మార్పులను తప్పనిసరిగా చేసుకోవాలి.
ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్త హీనత సమస్య లేకుండా చేస్తుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫె క్షన్స్ రాకుండా కాపాడుతుంది. బచ్చలికూర తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. అదే సమయంలో మూత్రవిసర్జనలో ఏవైనా సమస్యలు ఉంటే వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.