Mahesh Babu సూపర్ స్టార్ కావడానికి కారణం ఎవరో తెలుసా?
Mahesh Babu Movies: సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ పరిశ్రమకు వచ్చిన మహేష్ తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ లో మహేష్ ది ప్రత్యేక స్థానం. ఆచితూచి సినిమాలు చేస్తాడు మహేష్. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరున్న మహేష్ కి అటు మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఇలా అన్ని వర్గాలలో ఫాలోయింగ్ ఉంది.
ఒక ఇంటర్వ్యూ లో మీరు సూపర్ స్టార్ గా ఎదగడానికి కారణాలేమిటి..? అని అడుగగా, మహేష్ బాల్యంలో, తండ్రి కృష్ణ వేసవి సెలవులలో నా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించు అని అడుగగా మహేష్ సరేనన్నారట.
చైల్డ్ ఆర్టిస్ట్ గా నాన్నగారి సినిమాలలో నటించడం నా ఎదుగుదలకు కారణమైందన్న మహేష్, పరోక్షంగా ఆయన స్టార్ హీరోగా ఎదగడానికి తండ్రి కృష్ణ గారే అని జవాబు చెప్పారు. బాల నటుడిగా తొమ్మిది సినిమాలు చేసిన మహేష్ వాటిలో ఏడు సినిమాలు కృష్ణ తో చేశారు. బాల చంద్రుడు సినిమాకి కృష్ణ దర్శకుడిగా వ్యవహరించారు.