MoviesTollywood news in telugu

Mani Ratnam కెరీర్ లో బెస్ట్ సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

Mani Ratnam Movies : మణిరత్నం సినిమాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మణిరత్నం భార్య టాలీవుడ్ నటి సుహాసిని. మణిరత్నం సినిమాలో నటించాలని ప్రతి నటుడు కల కంటాడు. మణిరత్నం ఒక ప్రత్యేకమైన శైలితో సినిమాలు తీస్తాడు. భారతీయ సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్. ఈ డైరెక్టర్ తీసిన సినిమాలలో టాప్ సినిమాల గురించి తెలుసుకుందాం.

1989లో నాగార్జున హీరోగా కేవలం 60 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న గీతాంజలి సినిమా. గీతాంజలి సినిమా నాగార్జున ఇమేజ్ ని బాగా పెంచిది. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది.

1987 సంవత్సరంలో కమల్ హాసన్ హీరోగా నాయకుడు సినిమా తీశారు. ఈ సినిమా కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. కమల్ హాసన్ పారితోషికం 17 లక్షలు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

1991 లో రజనీకాంత్ మమ్ముట్టి నటించిన దళపతి సినిమాకు అప్పట్లోనే మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ సినిమా కూడా హీరోలకు మంచి పేరును తెచ్చి పెట్టింది.

అరవింద స్వామి హీరోగా రోజా సినిమాని తీశారు. ఈ సినిమాకు మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ లకు మొదటి సినిమా. వారికీ మొదటి సినిమాతోనే మంచి పేరు వచ్చింది.

ముంబై అల్లర్ల నేపథ్యంలో అరవింద స్వామి హీరో గా బొంబాయి సినిమా తీశారు. ఈ సినిమా కూడా అభిమానుల మనస్సును గెలుచుకుంది.

మాధవన్ హీరోగా 2000 సంవత్సరంలో సఖి సినిమా తీశారు.ఈ సినిమా టేకింగ్ చాలా అద్భుతం. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా నటించారు.

విద్యార్థి రాజకీయాలను బేస్ గా తీసుకుని సూర్య, మాధవన్ నటించిన యువ సినిమా మంచి విజయాన్ని సాధించింది.