Healthhealth tips in teluguKitchen

1 లడ్డు తింటే చాలు కీళ్ల నొప్పి,నడుము నొప్పి,మడమ నొప్పి అన్నీ రకాల నొప్పులు మాయం

calcium Laddu : మారిన జీవనశైలి కారణంగా మనలో చాలా మంది calcium లోపంతో బాధపడుతున్నారు. calcium లోపం ఉన్నప్పుడు ఆహారంలో మార్పులు చేసుకుంటే మంచి పలితం కనపడుతుంది. ఈ రోజుల్లో సమస్యలు అనేవి చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ఆ సమస్యలు తగ్గాలంటే చాలా సమయం పడుతుంది. అసలు సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవాలి.

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పి వంటివి వచ్చేస్తున్నాయి. అన్నీ రకాల నొప్పుల నుండి ఉపశమనం రావటమే కాకుండా వేసవిలో వచ్చే నీరసం,నిస్సత్తువ వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉండేలా చేయటానికి ఇప్పుడు చెప్పే లడ్డు సహాయపడుతుంది.

దీని కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. అరకప్పు నువ్వులను దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. కప్పున్నర ఖర్జూరం తీసుకొని గింజలు తీసేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో వేగించి పెట్టుకున్న నువ్వులను కలిపి చిన్న చిన్న లడ్డులుగా చేసుకొని రోజు ఒక లడ్డు తినాలి. వీటిని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి.
Joint Pains
వీటిలో calcium సమృద్దిగా ఉండుట వలన చాలా తొందరగానే మార్పు అనేది కనిపిస్తుంది. నొప్పులను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనకు నువ్వులు,ఖర్జూరం రెండూ సులభంగా అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి కాస్త ఓపిక చేసుకొని ఈ లడ్డులను తయారుచేసుకొని తింటే చాలా మంచిది.

ఈ లడ్డును చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు. ఈ లడ్డు తినటం వలన calcium లోపం లేకుండా ఉంటుంది. ఈ లడ్డులో ఉపయోగించిన Dates మరియు నువ్వులలో ఉన్న పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.