Mahesh babu సినిమాకు క్లాప్ కొట్టిన ఈ దర్శకుడిని గుర్తుపట్టారా…?
Uppena director Buchibabu Sana : సినీ పరిశ్రమకు సంబందించిన విషయాలను తెలుసుకోవటానికి ప్రతి అభిమాని సిద్దంగా ఉంటాడు. ఈ ఫోటోలో మహేష్ బాబు నేనొక్కడినే సినిమా షూటింగ్ లో ఉన్నాడు. షూటింగ్ సమయంలో ఒక్క సీన్ కోసం మహేష్ బాబు సిద్ధం అయ్యాక ఒక వ్యక్తి క్లాప్ కొడుతూ కనిపిస్తున్నాడు. అతడ్ని మీరు గమనించారా.
ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన బుచ్చిబాబు సన. నేనొక్కడినే సినిమా సుకుమార్ డైరెక్షన్ చేశాడు. ఆ సమయంలో బుచ్చిబాబు సుకుమార్ దగ్గర పని చేస్తున్నాడు. ఆ సమయంలోనే బుచ్చిబాబు చేత క్లబ్ కొట్టించాడు. అప్పుడు క్లాప్ కొట్టిన బుచ్చిబాబు ఈ రోజున మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
మెగా మేనల్లుడు వైష్ణవి తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమాకి బుచ్చిబాబు దర్శకుడు. సుకుమార్ శిష్యుడిగా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. యంగ్ హీరోలు అందరూ ఇప్పుడు బుచ్చిబాబు కోసం ఎదురు చూస్తున్నారు.
సుకుమార్ దగ్గర బుచ్చి బాబు ‘ఆర్య 2’, 100% లవ్, వన్ నేనొక్కడినే, కుమారి 21 ఎఫ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు పనిచేశాడు. మా గురువుగారి గైడెన్స్లో ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.