దేశముదురు సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Allu Arjun Desamuduru Full Movie :అల్లు arjun చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కొన్ని సినిమాలు కొందరికి రాసి పెట్టి ఉంటాయని అంటారు. అందుకే ఎవరి దగ్గరికి వెళ్లినా తిరిగి తన దగ్గరకే వస్తుంది. అలాంటి సినిమాల్లో దేశముదురు మూవీ ఒకటి.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, హన్సిక హీరోయిన్ గా డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన దేశముదురు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు, అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పింది. బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఆ సినిమాలోని అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో తన పాత్రతో మెప్పించి ఆడియన్స్ కి బాగా చేరువయ్యాడు.
నిజానికి ఆ సినిమా స్టోరీని హీరో సుమంత్ కు పూరీ జగన్నాథ్ వినిపిస్తే, సుమంత్ రిజెక్ట్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ చేజారి, చివరకు అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి, ఫర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించుకుకుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన దేశముదురు కథ తనకు ఎంతగానో నచ్చినప్పటికీ, ఆ సినిమాలోని హీరో పాత్రకు తాను సూట్ కానని అనిపించిందని సుమంత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసాడు.
వాస్తవానికి దేశముదురు మూవీలో హీరోగా నటిస్తే సినిమా ఫ్లాప్ అయ్యేదని, బన్నీ నటించడం వలన ఆ మూవీ సక్సెస్ అయిందని సుమంత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.
https://www.chaipakodi.com/