Savitri చేతిలో ఉన్న ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా…?
Mahanati savitri And Nagarjuna : మహానటి సావిత్రి అంటే ప్రతి ఒక్క హీరోయిన్ కి ఆదర్శం అని చెప్పవచ్చు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా విడుదల అయినా రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని సక్సెస్ గా ముందుకు సాగింది. మహానటి సినిమా చాలా సక్సెస్ అయింది. ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలను పొందింది.
ప్రస్తుతం సావిత్రికి సంబందించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక చిన్నబాబును సావిత్రి ఎత్తుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ ఫొటోలో ఉన్నది ఎవరంటూ ఆరా తీస్తే.. ఇప్పటి స్టార్ హీరోగా తెలిసింది.
ఇంతకు ఎవరా స్టార్ హీరో అంటే అక్కినేని నాగార్జున.అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ‘వెలుగు నీడలు’ అనే సినిమాలో నాగార్జున చిన్న పిల్లాడి పాత్రలో నటించారు.ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో ఈ సినిమా 1961 వ సంవత్సరంలో వచ్చింది.