నరాల బలహీనత, నరాలలో అడ్డంకులు… నరాల్లో నొప్పి తగ్గటమే కాదు… జీవితంలో రాదు
Nerve weakness Home Remedies In telugu : నరాల బలహీనత అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు కాళ్లు, చేతులు వణకడం, మాట్లాడే క్రమంలో కండ్ల నుంచి నీరు కారడం, అనుకోని సంఘటనలు చూసినా, విన్నా గుండె దడదడ లాడటం, బరువు లేని వస్తువులు కూడా మోయటానికి శక్తీ లేకపోవడం, రాయాలంటే చేతులు వణకడం తదితర సమస్యలు చూస్తుంటాం.
ఈ నరాల బలహీనత కారణంగా ఏ పని చేయలేక చాలా తొందరగా అలసటకు గురి అవుతారు. ఈ వ్యాధి నుంచి బయట పడటానికి ఆయుర్వేదంలో అద్భుతమైన నివారణ చిట్కాలు ఉన్నాయి. నరాల బలహీనత తో బాధపడేవారు కరివేపాకు తింటే నరాలను గట్టి పరుస్తుంది. కరివేపాకు నరాల బలహీనతకు చాలా బాగా సహాయపడుతుంది.
ఒక బౌల్ లో రెండు స్పూన్ల కరివేపాకు రసం, ఒక స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ పంచదార వేసి బాగా కలిపి ఉదయం,సాయంత్రం తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే క్రమంగా నరాల బలహీనత తగ్గిపోతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
కరివేపాకులో కోయినీ జెన్ అనే గ్లూకోజైడ్ ఉంటుంది.అందుకే దాని రుచీ,వాసనలు డిఫరెంట్ గా ఉంటాయి.కరివేపాకుని ఇంట్లో పెంచినట్లైతే ఒక మందుల షాపుని మన ఇంట్లో ఉంచుకున్నట్టే అవుతుంది. కరివేపాకు చెట్టు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.