మధ్యాహ్నం భోజనం చేయగానే కునుకు తీస్తున్నారా.. ఇది లాభమా, నష్టమా…తెలుసుకోండి
Health Benefits of Napping In telugu:మధ్యాహ్నం భోజనం చేయగానే కునుకు తీయటం మంచిదా కదా అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. మనలో చాలా మంది మధ్యాహ్నం భోజనం అయ్యాక కాస్త బద్ధకంగా అనిపించి పడుకుంటాం. స్కూల్ విద్యార్థులు నుంచి ఉద్యోగం చేసే వాళ్ళు,గృహిణి అలా ప్రతి ఒక్కరూ భోజనం అయ్యాక ఒక కునుకు తీస్తే రిలాక్స్ గా ఉంటుందని అంటుంటారు.
అయితే మనలో చాలా మందికి భోజనం చేశాక నిద్ర మంచిదా కాదా అనే అనుమానం కూడా ఉంటుంది. ఎటువంటి అనుమానం లేకుండా మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక కునుకు తీస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు కొంతమంది మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి సమయంలో నిద్ర పట్టదు అని భయపడుతూ ఉంటారు. అందులో నిజం లేదు ఆరోగ్యంగా ఉన్నవారు అరగంట సేపు పడుకోవచ్చు .
అలా పడుకుంటే మానసికంగా చాలా ప్రశాంతత కలుగుతుంది. అదే ఎక్కువసేపు పడుకుంటే మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి అరగంట సేపు నిద్ర మంచిదే. అయితే భోజనం అయ్యాక పడుకున్నప్పుడు కడుపులోనుంచి జీర్ణ రసాలు గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆహారం వైపు వస్తాయి.
దాంతో ఆమ్ల స్వభావం కారణంగా గొంతు మంట ఏర్పడుతుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. అంతేకాకుండా భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణాశయం మీద ఒత్తిడి తెస్తుంది. దాంతో గురక కూడా వస్తుంది. కాబట్టి భోజనం అయ్యాక ఒక గంట తర్వాత పడుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు.
భోజనం చేసిన వెంటనే పడుకుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. కాబట్టి భోజనం అయ్యాక కనీసం అరగంట గ్యాప్ ఇచ్చి పడుకోండి. కాబట్టి ఇప్పుడు చెప్పిన విధంగా మధ్యాహ్న సమయంలో నిద్ర అనేది మంచిదే. కాబట్టి అరగంట కన్నా ఎక్కువ సేపు పడుకోవటం మంచిది కాదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.