Mustard seeds:ఇంత చిన్న గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..? అయితే ఈ సమస్యలు ఉన్నవారు..
Mustard seeds Health Benefits in telugu :చాలా చిన్నగా ఉండి వంటింటిలో రెగ్యులర్ గా వాడే ఈ గింజలు మనకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. మనలో చాలా మంది అవాలను వాడతారు. కానీ వాటిల్లో ఉన్న ప్రయోజనాలు తెలియవు. కొంతమంది తాళింపులో వేసిన ఆవాలను ఏరి పాడేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పే ప్రయోజనాలు తెలిస్తే తప్పనిసరిగా తినటం అలవాటు చేసుకుంటారు.
ఆంధ్ర అంటే ‘ఆవకాయ’ కు పెట్టింది పేరు. ఆవకాయలో ఆవపిండిదే పెద్దపీట. అంతేకాదు రోజువారీ కూర తాలింపులోనూ ఆవాలు తప్పనిసరే. పరిమాణంలో ఎంత చిన్నగా ఉంటాయో అంత ఔషధీయ గుణాలున్న దినుసు. అందుకే నిత్యం తాలింపులో వాడతాం. ఆవాల్లో ఫైటో న్యూట్రియెంట్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి3 ఉంటుంది. ఆ ఔషధ గుణాలేంటో తెలుసుకుందాం.
ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడంవల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పంటినొప్పి కలిగినపుడు గోరువెచ్చటి నీటిలో ఆవ పొడి వేసి, పుక్కిలి పడితే నొప్పి తగ్గుతుంది. జుట్టుకు ఆవనూనె రాసుకుంటే పేలు, మాడు మీద కురుపులు, దురదలు తగ్గుతాయి. ఆవాల పొడిని తేనేతో కలిపి తీసుకుంటే అస్థమా, ఉబ్బస వ్యాధి లాంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
పులిపిరి కాయల మీద ఆవాలు నూరిన ముద్దతో పట్టు వేస్తే పులిపిరులు ఎండి రాలిపోతాయి. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఆవాల ముద్దలో కర్పూరము కలిపి ఆ ప్రాంతంలో రాయటం వల్ల భాధ తగ్గుతుంది. ఆవాలలో ఉండే సెలీనియం, మెగ్నీషియం అనే రసాయనాల వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపి, కొవ్వును తగ్గించే గుణం ఆవాలకి ఉంది.ఆవాల ముద్ద వేడినీళ్లలో వేసి స్నానం చేస్తే ఒంటినొప్పులు తగ్గుతాయి.
గొంతు నొప్పి, దగు,్గ జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపొడి, తేనె కలిపి తాగితే సమస్యలు నియంత్రించబడతాయి. ఘాటైన వాసన కలిగి ఉండి, క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. తెల్ల ఆవనూనె శరీరానికి రాసుకొని, నలుగుపెట్టి స్నానం చేస్తే చర్మ రంగును మెరుగు పరుస్తుంది. ఆవాలలో మ్యూసిలేజ్ అనే చిక్కటి పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, జీర్ణక్రియను పెంపొందిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు అర స్పూన్ ఆవపిండితో ఈ సమస్యలన్నీ నివారించబడతాయి.
ఆవాలను ఎక్కువగా తీసుకుంటే.. అలెర్జీ సమస్య ఉన్నవారు ఆవాలుకు దూరంగా ఉండటమే మంచిది. దీనిలో పైబర్ సమృద్దిగా ఉండుట వలన విరేచనాలు వికారం మరియు గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగిన మోతాదులో తీసుకోని ఇప్పుడు చెప్పిన అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ