ఒక లడ్డు తింటే నీరసం, అలసట,నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉంటారు… ముఖ్యంగా మహిళలకు
Oats Peanuts Ladoo Benefits : నీరసం, అలసట, నిస్సత్తువ లేకుండా హుషారుగా రోజంతా పనులు చేసుకోవాలంటే మంచి పాషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాంటి ఆహారం తీసుకుంటే ముఖ్యంగా మహిళలు రోజంతా హుషారుగా పనులను చేసుకుంటారు. ఇప్పుడు చెప్పే ఒక లడ్డు ప్రతిరోజు తింటే నీరసం, అలసట తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ఈ లడ్డు తయారీ కోసం… 10 ఎండు ఖర్జూరాలను తీసుకొని గింజ తీసి నీటిని పోసి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి. పొయ్యి మీద పాన్ పెట్టి దానిలో ఒక కప్పు ఓట్స్ వేసి రెండు నిమిషాల పాటు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్లో ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు వేసి బాగా వేగించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
ఒక మిక్సీ జార్ లో నానపెట్టిన ఖర్జూరాలు, వేగించిన ఓట్స్, వేరుశనగలు, చిటికెడు బ్లాక్ సాల్ట్, ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్ని చిన్ని లడ్డూలుగా తయారు చేసుకుని ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే పది రోజులు వరకు నిల్వ ఉంటాయి. ఈ లడ్డూలను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే అలసట, నీరసం అనేవి అస్సలు ఉండవు.
అలాగే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. ఎముకలు, కండరాలు దృఢంగా మారి నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా జీర్ణ ప్రక్రియ రేటు రెట్టింపు అవుతుంది. మహిళల్లో ముఖ్యంగా కనిపించే అలసట, నీరసం, రక్తహీనత వంటి అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి ఈ లడ్డు సహాయపడుతుంది.
అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా ఒక లడ్డు తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అలాగే తినాలని కోరిక కూడా తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు. కాబట్టి కాస్త ఓపికగా ఈ లడ్డును తయారుచేసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.