గుప్పెడు గింజలు తింటే చాలు విపరీతమైన ప్రోటీన్ లభిస్తుంది…ప్రోటీన్ లోపం అనేది ఉండదు
Ulavalu uses In Telugu :ఉలవలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్, జింక్, ఫోలెట్, మెగ్నీషియం వంటి విటమిన్లతో పాటు శరీరానికి అవసరమయ్యే మినరల్స్ అధికంగా ఉంటాయి. ఉలవలను ఒకప్పుడు పెద్దగా తినేవారు కాదు.
కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనలో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పడుతున్నారు. దాంతో ఎన్నో పోషకాలు ఉన్న ముఖ్యంగా ప్రోటీన్ సమృద్ధిగా లభించే ఉలవలను ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. మాంసం తినని వారికీ మంచి ఆహారం అని చెప్పవచ్చు.
అలాగే పోషకాహార నిపుణులు కూడా ఉలవలను కనీసం వారంలో రెండు సార్లు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. మాంసం కంటే ఉలవల్లోనే ఎక్కువ పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మాంసం తినని వారికి ఉలవలు మంచి పోషకాహారం అని చెప్పవచ్చు. ఉలవల్లో ఫాస్పరస్, కాల్షియం, ప్రొటీన్, ఐరన్ వంటివి సమృద్దిగా ఉండుట వలన నీరసం,నిసత్తువ లేకుండా చురుకుగా ఉంటారు.
అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారు కూడా ఆహారంలో బాగంగా చేసుకుంటే ఆ సమస్య నుండి బయట పడతారు. ఉలవల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగాను ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండుట వలన అధిక బరువు సమస్యతో బాధపడేవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఒక కప్పు ఉడికించిన ఉలవలను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు.
శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఉలవలు తింటే అస్సలు కొవ్వు చేరదు. అందువల్ల అన్ని వయస్సులవారు తినవచ్చు.
ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. అలాంటి వారు తమ ఆహార ప్రణాళికలో ఉలవలను చేర్చుకుంటే చక్కెర స్థాయిని నియంత్రించడంలో, తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.
ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికివస్తాయి.ఉలవల్లో ఆకలిని పెంచే గుణాలు ఉంటాయి. కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నవారు కూడా వారంలో మూడు సార్లు తీసుకుంటే మూత్ర పిండాల్లోని రాళ్లను పగలగొట్టి శరీరం నుండి బయటకు పంపటంలో సహాయపడతాయి.
కడుపులో నులి పురుగులను నివారించడంలో కూడా ఉలవలు ఉపయోగపడతాయి. ఉలవల కషాయాన్ని పాలలో కలుపుకుని తాగడం వల్ల నులి పురుగులు నశిస్తాయి. కాబట్టి ఉలవలను కనీసం వారంలో రెండు సార్లు తినటానికి ప్రయత్నం చేయండి. ఉలవలను తిని ఇప్పుడు చెప్పే అన్నీ రకాల ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.