ఎండు ద్రాక్షలో తేనె కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో…ముఖ్యంగా ఆ సమస్యలకు
Raisins And Honey Health Benefits In telugu : ఎండుద్రాక్ష, తేనె రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని విడిగా కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు తీసుకుంటే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది.
ఒక సీసాలో ఎండుద్రాక్ష వేసి అవి మునిగే వరకు తేనె పోసి మూత పెట్టి రెండు రోజులు కదపకుండా అలా వదిలేయాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెడితే 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం పరగడుపున తీసుకోవాలి. వీటిని తీసుకోవటానికి ముందు,తర్వాత అరగంట వరకు ఏమి తినకూడదు.
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, ఇది శరీరం అనేక రకాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేయటానికి సహాయపడుతుంది. ఇందులో పొటాషియం సమృద్దిగా ఉండటం వల్ల అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
తేనె మరియు ఎండుద్రాక్షను రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.సహజ శక్తి బూస్టర్ గా పనిచేస్తుంది. అలసట,నీరసం, నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. శరీరంలోని కండరాలు మరియు కణాలను బలోపేతం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది.
మలబద్ధకం సమస్యను మెరుగుపరచడంతో పాటు, జీర్ణక్రియ బాగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. చలికాలంలో ఎండుద్రాక్ష మరియు తేనె కలిపి తీసుకోవడం వల్ల శరీర బలహీనతను అధిగమించవచ్చు. ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎండుద్రాక్షలో వేరే రకమైన కాల్షియం కనిపిస్తుంది. ఇది పాలలో కనిపించే కాల్షియం కన్నా భిన్నంగా ఉంటుంది, దాని పేరు బోరాన్. ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఇది చాలా సహాయపడుతుంది..
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.