MoviesTollywood news in telugu

Nagarjuna కు డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Tollywood Hero Nagarjuna :అభిమాన నటుల గురించి తెలుసుకోవటానికి ప్రతి అభిమాని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. స్టార్ హీరోలకు ఒక్కొక్కసారి ఇతరులు డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే వారి సినిమాలు వేరే భాషలో రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా హీరోలకు డబ్బింగ్ చెప్పాలి. స్టార్ హీరో సినిమా తీసుకున్న నిర్మాతలు ఆ స్టార్ హీరోకు కరెక్ట్ గా సెట్ అయ్యే వాయిస్ కోసం చాలా అన్వేషణ చేస్తారు.

నాగార్జున సినిమాలు కోలీవుడ్లో డబ్ చేయాల్సివస్తే ఎక్కువగా నాగార్జునకు సీనియర్ హీరో సురేష్ డబ్బింగ్ చెప్పారట. ఈ విషయాన్ని సురేష్ ఒక షో లో చెప్పాడు. తమిళంలో నాగార్జున సినిమాలు డబ్ చేసినప్పుడు నాగార్జునకు వాయిస్ చెప్పడానికి నేనే గుర్తుకు వస్తానని సురేశ్ చెప్పుకొచ్చాడు.

కేవలం సినిమాలకు డబ్బింగ్ మాత్రమే కాదు.. ఇప్పటికీ నాగార్జున యాడ్స్‌ను తమిళంలో డబ్ చేయాలంటే తననే సంప్రదిస్తారని సురేశ్ చెప్పారు. ఆ రకంగా హీరో నాగార్జునకు ఇప్పటికీ తమిళంలో తానే డబ్బింగ్ చెబుతానని చెప్పకనే చెప్పాడు హీరో సురేశ్.