ఈ పొడిని రోజుకు అర స్పూన్ తీసుకుంటే పొట్ట కొవ్వు నెల రోజుల్లో మాయం అవుతుంది
Weight Loss Tips In telugu:ఈ రోజుల్లో మారిన జీవనశైలి, సరైన వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం, ఒత్తిడి, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఒక పొడి తయారు చేసుకుందాం.
ఈ పొడి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక్కసారి ఈ పొడిని తయారు చేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు వాడవచ్చు. ఈ పొడి తయారీ కోసం.. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి దానిలో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ కలోంజీ విత్తనాలు, రెండు స్పూన్ల నువ్వులు, 10 బాదం పప్పులు, రెండు రెబ్బల కరివేపాకు, అర స్పూన్ మిరియాలు వేసి ఐదు నిమిషాల పాటు వేగించాలి.
ఇలా వేగించిన వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ప్రతిరోజు భోజనం చేసే సమయంలో మొదటి ముద్దలో అర స్పూన్ పొడి వేసి కలిపి తినాలి. ఈ విధంగా ప్రతిరోజు తింటూ ఉంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
దాంతో అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు. శరీరంలో మలినాలు, విషాలు బయటకు పోతాయి. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారికి కూడా ఈ పొడి చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
కాబట్టి కాస్త ఓపికగా ఈ పొడిని వాడటానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఈ పొడి చెడు కొలెస్ట్రాల్ ని కూడా నియంత్రిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.