Kitchenvantalu

Kitchen Tips:గ్యాస్ బర్నర్ నల్లగా మారిందా? ఇలా చేస్తే చిటికెలో నలుపు పోయి మెరుస్తుంది..

Gas Burner cleaning tips in telugu: ప్రతి రోజు మనం గ్యాస్ స్టవ్ ఉపయోగిస్తూ ఉంటాం. దాంతో బర్నర్స్ చాలా మురికిగా మారిపోతూ ఉంటాయి. వాటిని శుభ్రం చేసుకోవటం కాస్త కష్టమైన పనే. ఇప్పుడు చెప్పే చిట్కాతో చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

ఒక కప్పులో బర్నర్స్ వేసి మునిగే దాక వెనిగర్ పోయాలి. దానిలో అరస్పూన్ బేకింగ్ సోడా వేసి రాత్రంతా ఆలా ఉంచేసి మరుసటి ఉదయం బర్నర్స్ ని బ్రష్ సాయంతో శుభ్రం చేస్తే మురికి అంతా తొలగిపోయి కొత్తవాటిల్లా మెరుస్తాయి. ఇలా 15 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే సరిపోతుంది.

Eno ని ఉపయోగించి కూడా గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయొచ్చు. ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ రసం, ఒక Eno పాకెట్ లో పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో గ్యాస్ బర్నర్స్ వేసి అరగంట తర్వాత శుభ్రం చేస్తే నల్లగా మారిన గ్యాస్ బర్నర్స్ తెల్లగా మెరుస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.