బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ప్రస్తుతం ఏం చేస్తున్నా తెలుసా..?
Bigg Boss abhijeet : బిగ్ బాస్ షో కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. బిగ్ బాస్ షోలో విన్నర్ అయినా అభిజిత్ ప్రస్తుతం ఏమి చేస్తున్నాడో తెలుసా…? అభిజిత్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత మిర్చీలాంటి కుర్రాడు సినిమాతోనూ అలరించాడు.
అయితే అనుకున్న విధంగా పలితాన్ని ఇవ్వలేదు. దాంతో అభిజిత్ యుఎస్ వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత బిగ్ బాస్ హౌస్లో సందడి చేసాడు. బిగ్ బాస్ విన్నర్ గా బయటకు వచ్చిన అభిజిత్ కు ఆఫర్స్ క్యూ కడతాయని అందరూ భావించారు. అయితే పెద్దగా అవకాశాలు ఏమి రాలేదు.
అమెజాన్ లో వచ్చిన మోడరన్ లవ్ అనే వెబ్ సిరీస్ లో తప్ప మరెక్కడ కనిపించలేదు. ప్రస్తుతం అభిజిత్ చేతిలో ఏ ప్రాజెక్ట్ లేదని సమాచారం. అయితే అభిజిత్ కు సినిమా అవకాశాలు రావటం లేదా…వచ్చిన అవకాశాలు నచ్చటం లేదా అనే విషయంలో క్లారిటి లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నాడు.