బాదం తొక్కలను పాడేస్తున్నారా…వీటిలో ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు
Almond Peels Uses: ఈ మధ్యకాలంలో మనలో చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటుగా చేసుకున్నారు. ప్రతిరోజు రాత్రి సమయంలో బాదంపప్పును నానబెట్టి మరుసటి రోజు ఉదయం పై తొక్క తీసి తింటున్నారు.ఇలా నానబెట్టి తింటే బాదంపప్పులో ఉన్న పోషకాలు 100% మన శరీరానికి అందుతాయి. అయితే బాదంపప్పు తిని తొక్కలు పాడేస్తూ ఉంటాం.
అయితే బాదంపప్పు తొక్కలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. బాదంపప్పు తొక్కలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు మరియు చర్మానికి మేలు చేస్తాయి. బాదం తొక్కలను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
బాదం తొక్కలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. గుడ్డు, తేనే, అలోవెరా జెల్ తో బాదాం తొక్కలను కలిపి పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని జుట్టుకు పట్టించి 15 నిమిషాలు అయ్యాగా శుభ్రం చేసుకోవాలి. తలలో దురద,పేలను తగ్గిస్తుంది.
బాదం తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్-E సమృద్దిగా ఉండుట వలన కొన్ని చర్మ సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది.ఫేస్ ప్యాక్‌లో బాదం తొక్కలను కలిపి వాడితే చర్మానికి మంచి పోషణ అందుతుంది. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతేకాక మొటిమలు, ఎలర్జీలను తగ్గించటంలో సహాయపడుతుంది.
ఆయుర్వేదం ప్రకారం దంత సమస్యలకు బాదం తొక్కలు బాగా సహాయపడతాయి. బాదం తొక్కలను కాల్చి మెత్తని పొడిగా చేయాలి. ఆ పొడితో దంతాలను శుభ్రం చేసుకుంటే దంత సమస్యల నుండి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.