Kitchen Hacks:రవ్వలో పురుగులు, చీమలు పడుతున్నాయా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి
Kitchen Tips in telugu:మన వంటింట్లో ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. వంట గదిలో మనం ఉపయోగించే పదార్ధాలలో రవ్వ తప్పనిసరిగా ఉంటుంది. ఉదయం సమయంలో టిఫిన్ చేసుకోవాలంటే…రవ్వ ఉంటే చాలా తొందరగా అయ్యిపోతుంది. రవ్వ ఎక్కువ రోజులు నిలువ ఉంటే కచ్చితంగా పురుగులు,చీమలు పడతాయి. రవ్వ పురుగు పట్టకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
రవ్వను వారానికి ఒకసారి ఎండలో పెట్టాలి. ఈ విధంగా ఎండలో పెట్టడం వలన వేడికి రవ్వలో ఉన్న కీటకాలు, పురుగులు, చీమలు వంటివి పోతాయి. రవ్వను పొయ్యి మీద మూకుడులో పోసి సిమ్ లో రెండు నిమిషాలు వేగిస్తే పురుగు పట్టకుండా నిల్వ ఉంటుంది.
రవ్వ ఉన్న డబ్బాలో వేపాకులను వేయాలి. వేపాకులను వేస్తే పురుగు పట్టకుండా కీటకాలకు దూరంగా ఉండవచ్చు. వేపలో ఉండే ఔషధ గుణాలు పురుగు పట్టకుండా చేస్తాయి. అయితే వేపాకులను ఎండబెట్టి ఒక పల్చని క్లాత్ లో చుట్టి పెట్టాలి. ఈ చిట్కాలను పాటిస్తే రవ్వకు పురుగు పట్టదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.