Beauty TipsHealth

White Hair:ఇలా చేస్తే 5 నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది…జీవితంలో తెల్లజుట్టు అనేది ఉండదు

Henna Hair Pack For White Hair To Black :ఈ మధ్య కాలంలో తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావటం ప్రారంభం అవుతుంది. దాంతో చాలా మంది కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అయితే వాటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది.

అలా కాకుండా మనం ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకున్న కలర్ ను వాడితే జుట్టు తొందరగా నల్లబడుతుంది. జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఒక బౌల్ తీసుకొని 100 గ్రా Henna పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కాఫీ పౌడర్, ఒక నిమ్మకాయ రసం పిండి బాగా కలపాలి. అంటే హెన్నా, నిమ్మకాయ, కాఫీ పౌడర్ ఈ మూడు బాగా కలిసేలా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ఒక అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట తర్వాత జుట్టుని సాదారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్నవారికి ఎక్కువ వారాల సమయం పడుతుంది. తెల్ల జుట్టు తక్కువగా ఉన్నవారికి తక్కువ వారాల సమయం పడుతుంది. ఈ రెమిడీని ఫాలో అయితే ఏటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.