‘ఆదిపురుష్’ లో సీత పాత్ర ని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Adipurush:యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఈ రోజు అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో త్రీడీ ఎఫెక్ట్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో లేనంత అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ రాఘవ రాముడిగా అద్భుతంగా నటించాడు. అలాగే సీత పాత్రలో కృతి సనన్ కూడా బాగా నటించింది. అయితే ఈ సినిమాలో సీత పాత్రకు మొదటగా డైరెక్టర్ ఓం రౌత్ దీపికా పడుకొనే ను సంప్రదించాడు. అయితే ఆమె డేట్స్ కోసం చాలా రోజులు ఎదురు చూశారట. ఆమెకు నటించాలని కోరిక ఉన్నా సరే, డేట్స్ సర్దుబాటు చెయ్యలేక ఈ సినిమాను మిస్ చేసుకుంది.