White Hair Turn Black:10 రూపాయిల ఖర్చుతో 7 రోజుల్లో తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు
White Hair Turn Black:ఈ మధ్య కాలంలో తెల్ల జుట్టు సమస్య ప్రతి ఒక్కరిలోనూ కనబడుతోంది. అంటే చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ వాడేస్తూ ఉంటారు. ఇలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి బ్లాక్ వాల్నట్స్ చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. వాల్నట్ తొక్కను పొడిగా తయారు చేసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చ నీటిలో వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి.
ఆ తర్వాత జుట్టుకి అప్లై చేసి గంట తర్వాత కుంకుడుకాయతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. హెన్నా పొడి కూడా తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది.
హెన్నా పొడి, కాఫీ పొడి, నిమ్మరసం ఈ మూడింటిని బాగా కలిపి జుట్టుకు రాసి ఒక గంట అయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.