రంగస్థలం సినిమా కోసం మహేష్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఈ టీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో మంచి గుర్తింపుపొందిన మహేష్ గురించి మనకు తెలిసిందే. అతను అవకాశాలకోసం చాల చోట్లకు తిరిగాడు కానీ తనకు పెద్దగా అవకాశాలు దొరకలేదు. జబర్దస్త్ లోకి వచ్చిన తరువాత తన ప్రతిభను మెచ్చుకొని కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళ సినిమాల్లో చిన్న క్యారక్టర్ లు ఇచ్చారు. కానీ వాటితో అతనుకు అంతంత మాత్రాన గుర్తింపు వచ్చింది. ఇక ఈమధ్యన విడుదలైన రంగస్థలం సినిమా లో కీలకమైన పాత్రను పోషించి బాగా ఫేమస్ అయ్యాడు. ఈ సినిమా లో చరణ్ తో పాటు చాలా సందర్భాలలో కనిపిస్తాడు. ఈ సినిమా కోసం అతను 150 రోజులు పనిచేసాడట.
రోజుకు 6000 రూపాయల వరుకు పారితోషకం తీసుకున్నాట్లు తెలుస్తుంది. ఈ లెక్కన మొత్తం ఈ సినిమాకోసం 9,00,000 రూపాయల వరుకు తీసుకున్నాడట. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సుకుమార్ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నాడు.
కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ మహేష్ ను చూసి అసూయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. మహేష్ మిగతా కామిడీయన్స్ తో పోలిస్తే అంత ఫేమస్ కాకపోయినా అతనికి ఇంత మంచి అవకాశం వచ్చినందుకు లోలోపలే కుళ్ళుకుంటున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.