Movies

మహానటి కోసం కీర్తి సురేష్ ఎంత పారితోషికం తీసుకుందో తెలిస్తే షాక్…!

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా రేపు ప్రేక్షుకుల ముందుకు రానున్నది. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. అలాగే మోహన్ బాబు ఈ సినిమాలో S.V. రంగారావు పాత్రను పోషించారు. యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వైజయంతి బేనర్ పై అశ్వనీదత్ కూతుళ్లు స్వప్న,ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సమంతా, విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సావిత్రి జీవిత కథను వీరిద్దరూ చెప్పబోతున్నారు.
సావిత్రి జీవితం గురించి అందరికి తెలిసిందే అయినప్పటికీ ఆమె గురించిన ఎవరికీ తెలియని కొన్ని అంశాలు ఈ సినిమాలో చూపిస్తున్నారని సమాచారం.

ఆమె ఎందరికో అభిమాన తారగా మారారు. సావిత్రి జీవితం గురించి సినిమా తీయాలంటే రెండు,మూడు పార్ట్ లుగా పడుతుందని చిత్ర బృందం చెప్పుతుంది.

మహానటి సినిమాలో టైటిల్ పాత్రను పోషిస్తున్న కీర్తి సురేష్ ఈ సినిమా కోసం కోటి ఏభై లక్షలు తీసుకుందని సమాచారం. కీర్తి సురేష్ సినిమాల్లోకి వచ్చాక ఇదే పెద్ద మొత్తంలో తీసుకున్న పారితోషికం అని చెప్పాలి. అయితే కీర్తి సురేష్ పారితోషికం గురించి తెలిసిన వారు షాక్ అవుతున్నారు.