అనుష్క, ఆర్తి లతో పవన్ కళ్యాణ్ ఎందుకు నటించలేదంటే…మిస్ అయినా సినిమాలు ఏమిటో…?
Pawan Kalyan Movies: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది. అలాగే అనుష్క గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుష్క ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం సినిమాలో మొదటగా హీరోయిన్ గా అనుష్కను అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అనుష్క ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే ఛాన్స్ దొరకలేదు. అలాగే ఆర్తి అగర్వాల్ కూడా పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు ఆర్తి అగర్వాల్ దాదాపుగా అందరు హీరోలు పక్కన నటించింది.
కానీ pawan kalyan తో నటించే అవకాశం రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ కళ్యాణ్ విషయానికొస్తే ఒక వైపు సినిమాలు చేస్తూ మరో ఒకవైపు రాజకీయాలలో చాలా బిజీగా ఉన్నాడు. అనుష్క ప్రస్తుతం సినిమాలను చాలా సెలక్టివ్ గా చేస్తుంది. ఆర్తి అగర్వాల్ ఈ లోకం నుండి వెళ్ళిపోయింది.
Click Here To Follow Chaipakodi On Google News