Beauty Tips

White Hair:ఇలా చేస్తే చాలు మీ తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది…సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు

White Hair Turn Black:ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య అనేది వచ్చేస్తుంది. చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య రావటంతో చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. ఇలా వాడటం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య వస్తుంది.

కాబట్టి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వైపుకు వెళ్లకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అంతే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తొలగి జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

మనకి ఇంట్లో కలబంద మొక్క ఉంటుంది కదా.. ఆ కలబంద మొక్క నుండి జెల్ తీసుకోవాలి. ఇందులో క్యాల్షియం, సెలీనియం, జింక్, క్రోమియం, కాపర్ మొదలైన ఖనిజాలు ఉండుట వలన జుట్టు పిగ్మెంటేషన్‌కు అద్భుతమైన నివారణగా పని చేస్తుంది. ఒక కప్పు కలబంద జెల్ లో రెండు స్పూన్ల henna పొడి, అరస్పూన్ కాఫీ పొడి వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేయాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News