ఆలీ కూతురు దెబ్బకు చంద్రమోహన్ మానుకున్న అలవాటు ఏంటి..?
Ali DAughter And Chandra Mohan:ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయినా మోస్ట్ ఎంటర్టైనింగ్ షోలలో “ఆలీతో సరదాగా” కూడా ఒకటి.అయితే ఈ షో ఎపిసోడ్ కు టాలీవుడ్ మరియు ఇతర భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన సీనియర్ నటి తులసి ముఖ్య అతిధిగా వచ్చారు.అలా వచ్చిన ఆమెతో ఆలీ ఎన్నో విషయాలను పంచుకుంటూ తమ సినిమా జీవితం టాపిక్ తీసుకొచ్చారు.అదే సమయంలో ఆలీ మాట్లాడుతూ సీనియర్ నటుడు చంద్రమోహన్ టాపిక్ తీసుకు వచ్చారు.
అయితే అదే సందర్భంలో చంద్రమోహన్ కు ఉన్న ఒక తుంటరి అలవాటు గురించి మాట్లాడారు.చంద్రమోహన్ సెట్ లో తనకి తెలిసిన వారిని వేళ్ళతో చెవి మీద కొట్టేవారని ఆ విషయం మీకు గుర్తుందా అని తులసిని కూడా అడిగారు.అలా ఓ రోజు తన కూతురు పక్కన ఎవరో అబ్బాయిని చంద్రమోహన్ అలాగే కొట్టగా ఆ అబ్బాయి గట్టిగా ఏడ్చేశాడని అప్పుడు తన కూతురిని ఎక్కడ కొట్టబోతాడో అని ముందే గ్రహించి ఒక రాయి పట్టుకొచ్చి ఇప్పుడు కొట్టు చూద్దాం అని స్వీట్ వార్నింగ్ ఇచ్చిన దెబ్బకు అప్పటి నుంచి చంద్రమోహన్ ఆ అలవాటు మానేసుకున్నారని ఆలీ ఈ షో ద్వారా తెలియజేసారు.