Healthhealth tips in telugu

Tips to Detox Body : బరువు తగ్గాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా.. శరీరాన్ని డిటాక్స్ చేయాల్సిందే..-

Detox Drinks: ఈ వాటర్‌ తాగితే.. శరీరంలోని చెత్త అంతా క్లీన్ అవుతుంది.. మన శరీరాన్ని రీసెట్‌ చేయడానికి డీటాక్సిఫికేషన్‌ అవసరం అని నిపుణుల చెబుతున్నారు. డీటాక్సిఫికేషన్‌ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఆకలి, నొప్పిని తగ్గిస్తుంది.

ఈ రోజుల్లో బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ కొవ్వు అనేది స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. శరీరంలో మిగతా భాగాలు సన్నగా ఉన్నా పొట్ట చుట్టూ మాత్రం కొవ్వు బాగా పెరిగి చూడటానికి అసహ్యంగా ఉంటుంది.ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పే డిటాక్స్ డ్రింక్స్ డైట్ లో భాగంగా చేసుకుంటే పొట్ట చుట్టూ కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు.

ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ అలోవెరా జెల్ లేదా కలబంద గుజ్జు ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవాలి

పుదీనా రసంలో నిమ్మరసం కలిపి తీసుకున్న పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది. దీనికోసం ఒక గ్లాసు నీటిలో కొన్ని పుదీనా ఆకులు ఒక స్పూన్ నిమ్మరసం రెండు నిమ్మ చెక్క లు వేసి బాగా మరిగించి వడగట్టి తాగాలి. ఈ విధంగా చేయటం వలన పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది

ఒక గ్లాస్ నీటిలో కొన్ని పుచ్చకాయ ముక్కలు రెండు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి వడగట్టి తాగితే పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది.

ఇప్పుడు చెప్పిన మూడు రకాల డిటాక్స్ డ్రింక్ లలో మీకు నచ్చిన డ్రింక్ తాగి పొట్ట చుట్టూ కొవ్వు సమస్య నుంచి బయటపడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.