రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన 6 సినిమాల్లో 4 ఫ్లాప్స్..ఏజెంట్ సహా…
Ram Charan Rejected movies:మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా 2007లో చిరుత సినిమాతో అరంగేట్రం చేసిన రామ్ చరణ్ ఆ తర్వాత మగధీరతో చరిత్ర తిరగరాసాడు. తనదైన దారిలో మెగా పవర్ స్టార్ సినిమాలు చేసుకుంటూ ఫాన్స్ ని పెంచుకుంటూ పోతున్నాడు. మరోపక్క తండ్రితో సినిమాతో నిర్మిస్తున్నాడు. రంగస్థలం ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అయితే ఆ మధ్య కొన్ని సినిమాలకు.. కొందరు దర్శకులకు నో చెప్పాడు. వాటి గురించి పరిశీలిస్తే, చిరుత రిలీజయ్యాక గౌతమ్ మీనన్ నుంచి చెర్రీకి సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ ఆఫర్ వచ్చింది. అయితే అప్పటికే ఈయన మగధీర సినిమాకు కమిట్ కావడంతో వదిలేసుకోవడంతో దాన్నే సూర్యతో గౌతమ్ మీనన్ చేసి హిట్ అందుకున్నాడు.
ఎటో వెళ్లిపోయింది మనసు మూవీ కథను ముందు కూడా చెర్రీకి గౌతమ్ చెప్పాడు. కానీ ఆరెంజ్ సినిమాతో అప్పుడే ఓ ఫ్లాప్ తో ఉన్న తనకు క్లాస్ కథలు సెట్ కావని రిజెక్ట్ చేసాడు. గౌతమ్ మీనన్ దాన్నినానితో చేస్తే, ప్లాప్ అయింది. క్లాస్ మాస్ కలబోసినా మణిరత్నంతో సినిమా చేయాలని ప్రతీ హీరోకు ఉంటుంది. కానీ ఓకే బంగారం కథ నచ్చినా కూడా అప్పుడు ఇతర సినిమాల వలన చెర్రీ చేయలేదు. దాంతో దుల్కర్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. తెలుగులోనూ ఓకే బంగారం విజయం సాధించింది.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి రెండు హిట్స్ తర్వాత మేర్లపాక గాంధీ కృష్ణార్జున యుద్ధం కథ చరణ్‌కు చెప్పాడు. అయితే నాయక్‌లో ద్విపాత్రాభినయం చేయడం వలన వెంటనే మరోసారి డబుల్ రోల్ ఎందుకని వదిలేసాడు. ఇది కూడా ప్లాప్ అయింది. ఇక మెగా కుటుంబానికి బాగా దగ్గర అయిన కళ్యాణ్ కృష్ణ కురసాల అప్పటికే సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం హిట్స్ ఇచ్చాడు. దాంతో చెర్రీతో మూవీ కోసం నేల టిక్కెట్టు కథ చెబితే నచ్చలేదు. ఇది ప్లాప్ అయిందనుకోండి.
సురేందర్ రెడ్డి‘ఏజెంట్’ మూవీ కథను చరణ్‌కు వినిపించాడు. చరణ్‌కు ఈ స్పై థ్రిల్లర్ చేయాలని ఉన్నా…బిజీ కారణంగా ఈ సినిమా చేయలేకపోయాడు. దాంతో ఆ సినిమా అఖిల్ చేసాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బొక్క బోర్లా పడింది.