పరగడుపున వీటిని తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా…అసలు నమ్మలేరు
Early Morning Foods In telugu : మన శరీరం ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతి రోజు ప్రారంభంలో తీసుకునే ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఉదయం సమయంలో తీసుకునే ఆహారం రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది. ఉదయం పరగడుపున కొన్ని ఆహారాలు తింటే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి,తేనె కలిపి తాగితే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.
ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం., తేనె కలిపి తాగితే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది నిమ్మరసం శరీరంలోని బ్యాక్టీరియాను, విష పదార్థాలను బయటకు పంపుతుంది.
బొప్పాయి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయిలో ఫైబర్,.పోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఉదయం పరగడుపున చిన్న కప్పు బొప్పాయి ముక్కలను తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.