Hair Fall Tips:ఒక్కసారి ఇది రాసుకోండి… జుట్టు రాలటం తగ్గి రెట్టింపు వేగంతో జుట్టు పెరుగుతుంది
Hair growth Tips : ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గించుకోవటానికి ఒక మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం. దీని కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. రాత్రి సమయంలో రెండు స్పూన్ల మెంతులను నీటిని పోసి నానబెట్టాలి.
మరుసటి రోజు ఈ నీటిని వడకట్టి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న ఎర్ర ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పది వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి మెత్తని పేస్ట్ గా చేసి రసం తీయాలి. ఈ రసంలో మెంతుల నీటిని పోసి బాగా కలిపి స్ప్రే బాటిల్ లో పోయాలి.
జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టేలా స్ప్రే చేసి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు రెట్టింపు వేగంతో పెరుగుతుంది. వెల్లుల్లిలో ఉండే మెగ్నీషియం,విటమిన్స్ జుట్టుకి మంచి పోషణ అందించి జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుంది. మెంతులను జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. అలాగే చుండ్రు సమస్యను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/