ఓట్స్ Vs కార్న్ ఫ్లేక్స్…ఏది తింటే ఆరోగ్యానికి మంచిది…నమ్మలేని నిజాలు
oats And corn flakes Benefits In telugu : ఓట్స్ మరియు కార్న్ ఫ్లేక్స్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఓట్స్ మరియు కార్న్ ఫ్లేక్స్…రెండింటిలో ఏది తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం. ఓట్స్ విషయానికి వస్తే పోషకాలు మరియు ఫైబర్ సమృద్దిగా ఉంటాయి.
అలాగే ఓట్స్ లో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. ఓట్స్ లో ఐరన్, థయామిన్, జింక్, మెగ్నీషియం మరియు సెలీనియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇది సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఇక కార్న్ ఫ్లేక్స్ విషయానికి వస్తే…మొక్కజొన్నతో తయారు చేయబడిన కార్న్‌ఫ్లేక్స్ క్రంచీ మరియు క్రిస్పీ తృణధాన్యం.
దీనిని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడతారు. కార్న్‌ఫ్లేక్స్ ని ఉడికించవలసిన అవసరం లేదు. గోరువెచ్చని పాలు, పంచదార కలిపితే రెండు నిమిషాల్లో రెడీ. కార్న్‌ఫ్లేక్స్ లో విటమిన్లు, ఫోలేట్, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ మరియు డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉంటాయి.కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కార్న్ ఫ్లేక్స్ ని మితంగా తీసుకుంటే బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
ఓట్స్ Vs కార్న్ ఫ్లేక్స్…రెండు కూడా బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవటానికి మంచి ఎంపికలుగా చెప్పవచ్చు. 100 గ్రాముల ఓట్స్‌లో 26 గ్రాముల ప్రోటీన్ ఉంటే…అదే కార్న్ ఫ్లేక్స్ లో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఓట్స్ లో 16 గ్రాముల ఫైబర్ ఉంటే…అదే కార్న్‌ఫ్లేక్స్‌లో 2 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటుంది. ఒక కప్పు ఓట్స్‌లో 300 కేలరీలు ఉంటే…అదే కార్న్‌ఫ్లేక్స్‌లో 100 కేలరీలు మాత్రమే ఉంటాయి.
ఓట్స్ లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనిలో ఉండే కరిగే ఫైబర్ మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కడుపు నిండుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. కాబట్టి బరువు తగ్గాలని అనుకొనే వారు తప్పనిసరిగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఓట్స్ తీసుకోవచ్చు.
కార్న్ ఫ్లేక్స్ గుండెకు మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి. కార్న్ ఫ్లేక్స్ లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. ఓట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. కార్న్ ఫ్లేక్స్ శారీరకంగా చురుగ్గా ఉండే వారికి చాలా మేలును చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/