MoviesToday gold rate

హీరో వడ్డే నవీన్ భార్య టాలీవుడ్ స్టార్ హీరో చెల్లెలు అన్న సంగతి తెలుసా..? ఆ హీరో ఎవరంటే…?

Tollywood Hero Naveen Vadde:కోరుకున్న ప్రియుడు సినిమాతో నిర్మాత వడ్డే రమేష్ తనయుడు నవీన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటించాడు. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సినిమా నవీన్ కెరీర్ ని మలుపు తిప్పింది. అయితే ఆతర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. సినిమాల ఎంపికలో సరిగ్గా వ్యవహరించకపోవడం దీనికి కారణమని కొందరంటే, ప్రేమ పెళ్ళికారణంని మరికొందరు అన్నట్టు పుకార్లు వచ్చాయి. మొత్తానికి ఇండస్ట్రీ నుంచి నెమ్మదిగా దూరమయ్యాడు.

మాజీ సీఎం ,నటరత్న ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కూతురిని నవీన్ ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అయితే కొన్నాళ్లకే మనస్పర్ధలతో విడిపోయారు. అందుకే నందమూరి కుటుంబం ఆగ్రహానికి గురై ,ఇండస్ట్రీ అతన్ని పక్కన పెట్టేసిందని చెప్పుతూ ఉంటారు. దశాబ్దం పైనే యితడు ఇండస్ట్రీకి దూరం కావడంతో అందరూ మర్చిపోయారు కూడా.

ఆ తర్వాత వడ్డే నవీన్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ వడ్డే నవీన్ రియల్ లైఫ్ లో సంతోషంగా ఉన్నాడు. మరి ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగిన ఈ హీరో రీఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.