Poha Dosa:అటుకులతో ఒక్కసారి ఇలా Dosa వేసుకోండి హోటల్ Dosa కన్నా రుచిగా ఉంటాయి
Poha Dosa Recipe:ఉదయం సమయంలో ఎక్కువగా ఇడ్లీ,dosa,ఉప్మా వంటి వాటిని చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా అటుకులతో వెరైటీగా dosa లు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఎన్నో పోషకాలు మన శరీరానికి అందటమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
కావలసిన పదార్ధాలు
1 కప్పు అటుకులు
1 కప్పు బొంబాయి రవ్వ
1 కప్పు పెరుగు
½ స్పూన్ ఉప్పు
1 కప్పు నీరు
½ స్పూన్ బేకింగ్ పౌడర్
తయారి విధానం
ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు అటుకులు, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు మరియు ½ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి అరగంట అయ్యాక మిక్సీ జార్ లో వేసి ఒక కప్పు నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ½ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. పిండి నురుగుగా మారిన తర్వాత, వేడి పెనం మీద పిండిని పోయాలి.దోసె పైభాగం పూర్తిగా వేగిన తర్వాత… కొబ్బరి బెల్లం చట్నీతో అటుకుల దోసను ఆస్వాదించండి.