ఇంద్రజకు అదృష్టం కల్సి రాలేదా…కారణాలు ఇవేనట…అసలు నమ్మలేరు
Tollywood senior heroine Indraja :సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయం,టాలెంట్ ఎన్ని వున్నా, అదృష్టం తప్పనిసరిగా ఉండాలి. లేదంటే స్టార్ హీరోయిన్ గా ఎదిగే ఛాన్స్ లు రావు. ఇదేకోవలో హీరోయిన్ ఇంద్రజను చెప్పుకోవచ్చు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి మినహా,సూపర్ స్టార్ కృష్ణ,నందమూరి నటసింహం బాలకృష్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వంటి హీరోల సరసన నటించింది. ఇక నాగార్జున డ్యూయెల్ రోల్ చేసిన హలో బ్రదర్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది.
అంతేకాదు స్టార్ కమెడియన్ అలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన యమలీల మూవీలో అలీ సరసన హీరోయిన్ గా కేరీర్ స్టార్ట్ చేసి అదరగొట్టింది. ఆతర్వాత పలు సినిమాలతో అలరించిన ఇంద్రజ తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఛాన్స్ లు రాకుండా పోవడంతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. పలు సీరియల్స్ లో పాజిటివ్ షేడ్స్ తో పాటు నెగెటివ్ షేడ్స్ గల పాత్రల్లో కూడా నటించింది. స్టార్ హీరోల సరసన మరిన్ని అవకాశాలు వచ్చి ఉంటే స్టార్ హీరోయిన్ హోదా వచ్చేదేమో.
ఇక ఈటీవీలో పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కూడా ఇంద్రజ గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన ఇంద్రజ దిక్కులు చూడకు రామయ్య,లయన్,శమంతకమణి మూవీస్ లో చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి విజయాలను అందుకుంటోందో చూడాలి.