Healthhealth tips in telugu

Egg Shells Benefits:కోడిగుడ్డే కాదు.. దాని పెంకుతో కూడా బోలెడు లాభాలు.. తెలిస్తే అస్సలు పారేయరు!

Egg Shell Benefits :గుడ్డు పెంకును మనం సాదారణంగా పాడేస్తూ ఉంటాం. వీటిలో కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు.

గుడ్డు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్డులో ఉండే పోషకాలు మనకు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయని డాక్టర్స్ రోజుకి ఒక గుడ్డు తినమని చెబుతుంటారు. కొంత మంది గుడ్డును ఇష్టపడతారు. కొంత మంది ఇష్టపడరు. అయితే గుడ్డు తినేటప్పుడు సాధారణంగా పై పెంకు తీసి పాడేస్తూ ఉంటాం. అది చాలా తప్పు ఎందుకంటే గుడ్డు పెంకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

అయితే ఈ విషయం మనలో చాలామందికి తెలీదు. గుడ్డు పెంకులు డైరెక్టుగా తినకూడదు. గుడ్డు పెంకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆరబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ గుడ్డు పెంకుల పొడిని రోజు కి పావు స్పూనులో సగం మోతాదులో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్డు పెంకులో క్యాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఈ పొడిని నీరు లేదా పాలలో కలుపుకుని తాగితే ఎముకలు దంతాలు కండరాలు బలంగా ఉంటాయి.

ఎముకలు బలంగా తయారయ్యి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.ఈ పొడితో పళ్ళు తోముకుంటే పసుపు పచ్చగా మారిన పళ్ళు తెల్లగా తళతళా మెరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తరిగిపోతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుడ్డు పెంకులో ఉండే విటమిన్ డి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పొడిని లిమిట్ గా తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం మరియు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News