ఉదయం పరగడుపున 1 స్పూన్ పొడి ఇలా తీసుకుంటే ఎంత లావుగా ఉన్నా సరే దెబ్బకు సన్నబడతారు
Belly Fat Reduce Tips:ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో ఇప్పుడు చెప్పే పొడిని తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, ఎక్కువగా కూర్చుని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.
మిక్సీ జార్ లో మూడు స్పూన్ల జీలకర్ర, అర స్పూన్ పసుపు, ఐదు యాలకులు, నాలుగు మిరియాలు, ఒక స్పూన్ సొంటిపొడి, రెండు అంగుళాల దాల్చిన చెక్క వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు వాడుకోవచ్చు. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీరు కాస్త వేడి అయ్యాక తయారు చేసి పెట్టుకున్న పొడిని ఒక స్పూన్ వేసి రెండు నిమిషాలు మరిగించాలి.
ఆ తర్వాత రెండు లెమన్ స్లైసెస్ వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మరిగించి స్ట్రైనర్ సహాయంతో నీటిని వడగట్టి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు తాగుతూ ఉంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా శరీరంలో విషాలు కూడా బయటకి తొలగిపోయి అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు. అలాగే ఈ డ్రింక్ డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/