షుగర్ ఉన్నవారు లవంగాలు తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా?
Diabetes Care in telugu : డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలాగే తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారిలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తప్పనిసరిగా డైట్ లో చేర్చుకోవాలి.
భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధద్రవ్యాల్లో లవంగం ఒకటి. లవంగాల్లో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, హైడ్రాలిక్ ఆసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.లవంగాలలో ‘నైజీరిసిన్’ అనే సమ్మేళనం కూడా ఉంటుంది.
ఇది డయాబెటిస్‌ను నివారించడంలో, ఇన్సులిన్ చర్యను మెరుగుపర్చడంలో, నూతన కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది . రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఒక లవంగం నోటిలో వేసుకొని నమలచ్చు. లేదా రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో రెండు లవంగాలను వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగవచ్చు.
అలా కాకుండా రెండు లవంగాలను నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. ఇలా లవంగాలను తీసుకోవటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా అధిక బరువు,కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/