గర్భిణీ స్త్రీలు ఈ ఒక్క పండును తమ ఆహారంలో చేర్చుకుంటే.. ఊహించని ఎన్నో ప్రయోజనాలు
Eating Apples During Pregnancy:గర్భధారణ సమయంలో తీసుకోవలసిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ సమయంలో తీసుకొనే ఆహారం విషయంలో కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి. గర్భధారణ సమయంలో Apple తింటే ఎన్నిప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. Apple ని చాలా శుభ్రంగా కడగాలి. అలాగే తినే సమయంలో గింజలు లేకుండా చూసుకోవాలి.
Apple లో నీరు మరియు కార్బోహైడ్రేట్, గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ వంటి సాధారణ చక్కెరలు, కరగని మరియు డైటరీ ఫైబర్, థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, పిరిడాక్సిన్ మరియు ఫోలేట్ వంటి B-కాంప్లెక్స్ విటమిన్,విటమిన్ సి, విటమిన్ ఎ, ఇ మరియు కె, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మరియు ఫాస్పరస్ వంటి అవసరమైన ఖనిజాలు,బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ మరియు ఆంథోసైనిన్ వంటి ఫైటోన్యూట్రియెంట్ లు సమృద్దిగా ఉంటాయి.
గర్భధారణ సమయంలో Apple తినడం వల్ల కాబోయే తల్లి మరియు పెరుగుతున్న బిడ్డ ఇద్దరికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. Apple లోని విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.
Apple లోని బి-కాంప్లెక్స్ విటమిన్లు ఎర్ర రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. గర్భధారణ సమయంలో Apple తినడం వలన బిడ్డకు అలెర్జీలు మరియు ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన గర్భధారణ సమయంలో సాదారణంగా వచ్చే రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన మలబద్దకం సమస్య లేకుండా చేస్తుంది.
విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. గ్లూకోజ్, సుక్రోజ్ మరియు ఫ్రక్టోజ్ వంటి సాధారణ చక్కెరలు ఉండుట వలన తక్షణ శక్తి లభిస్తుంది. గర్భధారణ సమయంలో యాపిల్స్ తినడం వల్ల బిడ్డలో ఉబ్బసం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాపిల్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాబోయే తల్లి ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి. బలమైన ఊపిరితిత్తులు శ్వాస మరియు శ్వాసకోశ సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.
Apple లో ఉండే కాల్షియం శిశువులో బలమైన ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది. మెదడు కణాల నష్టాన్ని నివారించి జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది. అయితే రోజుకి ఎన్ని Apples తినాలి అనే విషయానికి వచ్చే సరికి…గర్భధారణ సమయంలో రోజుకి ఒక Apple తింటే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/