White Hair:ఒక్కసారి రాస్తే చాలు మీ తెల్లజుట్టు నల్లగా మారి జీవితంలో తెల్లబడదు
White Hair:ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితి, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో తెల్లజుట్టు సమస్యతో… మనలో చాలా మంది చాలా చిన్న వయస్సులోనే ఇబ్బంది పడుతున్నారు. ఇలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావటం వలన బయటకు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
దాంతో మార్కెట్ లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
అరకప్పు పెరుగులో ఒక స్పూన్ మిరియాల పొడి,ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటె తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
ఒక కప్పు బ్లాక్ టీ లేదా కాఫీలో తగినంత హెన్నా పౌడర్ కలపండి. ఆరు గంటల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.